News March 26, 2025
MBNR: ఆ కళాశాలలకు గమనిక

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2024-25 సంవత్సరంలోపు అఫిలియేషన్ ముగిసిన కళాశాల యాజమాన్యాలు తిరిగి అఫిలియేషన్ చేయించుకోవాలని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ ప్రధానాచార్యులు మహమ్మద్ మేరాజుల్లా ఖాన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈనెల 31వ తేదీలోపు అఫిలియేషన్ చేయించుకునేందుకు అవకాశం ఉందన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కళాశాలల యాజమాన్యాలు ఉపయోగించుకోవాలని సూచించారు.
Similar News
News October 29, 2025
HYD: భారీగా బకాయిలు.. నల్లా కనెక్షన్ కట్!

HYD జలమండలికి దాదాపు రూ.1,300 కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నగరవాసుల నల్లా ఛార్జీలే రూ.147కోట్లు వసూలు కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు నల్లా బిల్లును పూర్తిగా వసూలు చేసేందుకు నగరంలో చర్యలు షురూ అయ్యాయి. బకాయి ఉన్న వినియోగదారులకు ముందుగా నోటీసులు జారీ చేస్తారు. గడువు ముగిసినా చెల్లించకపోతే వారికి నీటి సరఫరా నిలిపివేసి, వసూలుకు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.
News October 29, 2025
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీకి సీఎం గ్రీన్సిగ్నల్

TG: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలన్న ఇంజినీర్ల ప్రతిపాదనకు CM రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని నుంచి సుందిళ్లకు 80TMCల నీటిని గ్రావిటీ ద్వారా తరలించి, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో MHలో ఏర్పడే ముంపుపై అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని నీటిపారుదల శాఖ సమీక్షలో సూచించారు.
News October 29, 2025
రంపచోడవరం: ’54మంది గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలింపు’

తుఫాన్ నేపథ్యంలో ఈనెలలో ప్రసవాలకు సిద్ధంగా ఉన్న 54 మంది గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రులకు మంగళవారం చేర్చడం జరిగిందని రంపచోడవరం అడిషినల్ DM&HO డా.సరిత తెలిపారు. వారిలో 14 మందిని PHCలు, ఐదుగురుని CHC ఆసుపత్రులు, 33 మందిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రుల్లో చేర్చడం జరిగిందన్నారు. అన్ని CHCల్లో వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు.


