News March 24, 2025

MBNR: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో గద్వాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. గద్వాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News December 4, 2025

GNT: మారువేషంలో మార్చూరీని పరిశీలించిన సూపరింటెండెంట్.!

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి మరోసారి మారువేషంలో ఆసుపత్రిలోని అడ్మినిస్ట్రేషన్ తీరును పరిశీలించారు. ఈసారి ఆయన టీషర్ట్, మడత వేసిన ప్యాంటు, మాస్క్, మంకీ క్యాప్ ధరించి మార్చూరీ బయట సాధారణ వ్యక్తిలా ఒక గంటపాటు కూర్చున్నారు. అక్కడే ఉండి, మృతదేహాల బంధువులతో మాట్లాడి, మార్చూరీలోని పరిస్థితులను అధ్యయనం చేశారు.

News December 4, 2025

HYD: జలమండలి పరిధిలో 14.36 లక్షల కనెక్షన్లు

image

జలమండలి పరిధిలో 14.36 లక్షల నల్లా కలెక్షన్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో 85% వరకు డొమెస్టిక్ క్యాటగిరి కనెక్షన్లు ఉండగా, మిగిలిన 15% వాణిజ్య, ఇండస్ట్రీయల్ తదితరాలు ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 10 -15 వేల వరకు కొత్త కనెక్షన్లు మహానగర వ్యాప్తంగా మంజూరు అవుతున్నాయి. వాణిజ్యం అత్యధికంగా ఉన్నప్పటికీ క్యాటగిరిలో మాత్రం తక్కువ కనిపిస్తోందని జలమండలి అనుమానం వ్యక్తం చేసింది.

News December 4, 2025

చనిపోయినట్లు నటించే బ్యాక్టీరియా!

image

అత్యంత అరుదైన బ్యాక్టీరియా(టెర్సికోకస్ ఫీనిసిస్)ను US సైంటిస్టులు కనుగొన్నారు. స్పేస్‌క్రాఫ్ట్ అసెంబ్లీ రూమ్స్ లాంటి భూమిపై ఉన్న అతి పరిశుభ్రమైన వాతావరణాలలోనూ ఇది జీవించగలదని తెలిపారు. ‘తన మనుగడను కొనసాగించడానికి చనిపోయినట్లు నటిస్తుంది. వీటిని గుర్తించడం, నాశనం చేయడం కష్టం. ఏదైనా బ్యాక్టీరియా వ్యాప్తి కట్టడికి కఠినమైన శుభ్రతా ప్రమాణాలు ఎందుకు పాటించాలో ఇలాంటివి నిరూపిస్తాయి’ అని పేర్కొన్నారు.