News March 24, 2025
MBNR: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో గద్వాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. గద్వాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 25, 2025
చైనా ఎఫ్‌డీఐలపై ఆంక్షల సడలింపునకు కేంద్రం యోచన

చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI)పై పెట్టిన ఆంక్షలను కాస్త సడలించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్ ప్రొడక్టుల విషయంలో అనుసరిస్తున్న కఠిన నిబంధనలను సడలించాలని అనుకుంటున్నట్టు సమాచారం. కేంద్ర క్యాబినెట్ పరిశీలనకు అధికారులు ఒక నోట్ రెడీ చేశారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2020లో గల్వాన్ బార్డర్ ఘర్షణ తర్వాత చైనా ఎఫ్‌డీఐలపై ఆంక్షలు విధించింది.
News November 25, 2025
తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

AP: మలక్కా జలసంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడి మరో 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 29న రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో బారీ వర్షాలు కురుస్తాయని.. 30వ తేదీన ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
News November 25, 2025
MBNR: భార్య హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భార్య హత్య కేసులో నిందితుడైన మిర్యాల రాములు (ఏ1)కు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కల్యాణ్ చక్రవర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. వివాహేతర సంబంధానికి భార్య అడ్డుపడుతుందనే కారణంతో నిందితుడు సైకిల్ హ్యాండిల్‌తో ఛాతీ, కడుపుపై తీవ్రంగా కొట్టి హత్య చేశాడు. ఈ కేసును విజయవంతంగా పూర్తి చేసిన పోలీసు బృందాన్ని ఎస్పీ డి.జానకి అభినందించారు.


