News January 18, 2025
MBNR: ఇంటర్ బోర్డు నిఘాలో ప్రయోగ పరీక్షలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే నెల 3 నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల పర్యవేక్షణకు హైదరాబాదులోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో కమాండ్, కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగే పరీక్షలను సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తామని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 22 వరకు కొనసాగుతాయని అధికారులు వివరించారు.
Similar News
News February 18, 2025
MBNR: సైబర్ వలలో ముగ్గురు వ్యక్తులు.. రూ.1.50లక్షలు స్వాహా

ఓ ప్రభుత్వ ఉద్యోగి ఖాతాలో నుంచి సైబర్ నేరస్థులు నగదు కాజేసిన ఘటన MBNR జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్యోగికి ఫోన్ చేసి ‘నీపై స్టేషన్‌లో కేసు నమోదైంది.. రూ.లక్ష ఇస్తే కేసు లేకుండా చేస్తాం.’ అని అనటంతో ఉద్యోగి నమ్మి రూ.90వేలు వారికి పంపించారు. తర్వాత తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. మరో ఇద్దరి వ్యక్తుల నుంచి సైతం సుమారు రూ.62వేలను దోచుకున్నారు.
News February 18, 2025
అడ్డాకుల: డ్రోన్ తగిలి గాయాలపాలైన యువ రైతు.!

వరి పంటకు మందు స్ప్రే చేసే డ్రోన్ తగిలి ఓ రైతు గాయాలపాలైన ఘటన అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే రాచాల గ్రామానికి చెందిన రైతు దండు ఆంజనేయులు వరి పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పంటకు మందు స్ప్రే చేయడానికి డ్రోన్ వాడుతున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు డ్రోన్ తగిలి తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
News February 18, 2025
NRPT: గల్లంతైన తండ్రీకొడుకులు మృతి

బావిలో పడి <<15494116>>గల్లంతైన తండ్రీకొడుకులు<<>> మృతిచెందిన ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తన భార్య గ్రామమైన మండల పరిధిలోని మద్దెలబీడులో కర్ణాటకకు చెందిన శివయ్య(35) కుటుంబంతో ఉంటున్నారు. తన కుమారుడు(5) ప్రమాదవశాత్తుబావిలో పడిపోగా.. కాపాడటానికి వెళ్లి తను కూడా మునిగిపోయారు. వారిని సహాయక సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.