News September 24, 2024
MBNR: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదరుచూపులు !
ఇటీవల కురిసిన వర్షలకు పేద మధ్యతరగతి కుటుంబాల్లో గుబులు మొదలవుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ అధికారులు గుర్తించిన లెక్కల ప్రకారం 46,700పైగా శిథిలావస్థకు చేరిన గృహాలు, భవనాలు ఉన్నాయని, ఈ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం జిల్లా వ్యాప్తంగా 2.71లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని త్వరగా అమలు చేసి, పేద మధ్యతరగతి వారిని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News October 11, 2024
MBNR: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి
MBNR, NGKL,GDWL, NRPT,WNP జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

వనపర్తి: స్వీపర్ కూతురు టీచర్..!
వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం మాధవరావుపల్లి గ్రామానికి చెందిన మండ్ల వెంకటయ్య ప్రభుత్వ స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కూతురు వనిత డీఎస్సీ ఫలితాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ SGT జాబ్ సాధించింది. కాగా నాన్నకు తోడుగా స్వీపర్‌గా సాయం చేసేది. వనిత తల్లిదండ్రులు మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే చదువులో ముందంజలో ఉంటూ ఉద్యోగాన్ని సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆమెను అభినందించారు.