News March 25, 2025
MBNR: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు మేస్త్రీలుగా మహిళలు: కలెక్టర్

రాష్ట్రంలోనే మొదటిసారిగా వినూత్నంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు 41 మంది మహిళా మేస్త్రీలను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. సోమవారం బండమీదిపల్లిలోని నిర్మితి కేంద్రంలో నాక్ ద్వారా మహిళా సంఘాల సభ్యులు 41 మందిని ఎంపిక చేసి వారికి మేస్త్రీలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణ అనంతరం పనిలో రాణించాలన్నారు.
Similar News
News October 19, 2025
కురుమూర్తి ఆలయ హుండీ లెక్కింపు రూ.4.48 లక్షల ఆదాయం

చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపురం గ్రామ సమీపంలో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయంలో అమావాస్య, శని, సోమవారాలను పురస్కరించుకొని భక్తులు సమర్పించిన హుండీ డబ్బులను శనివారం ఆలయ సిబ్బంది లెక్కించారు. హుండీ ద్వారా రూ.4,48,248 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News October 18, 2025
MBNR: బీసీ బిల్లును అమలు చేయాలి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ దగ్గర శనివారం బీసీ ఉమ్మడి జిల్లా జేఏసీ ఛైర్మన్ బెక్కం జనార్దన్, వివిధ సంఘాల నాయకులు బీసీ బంద్‌ను నిర్వహించారు. జేఏసీ ఛైర్మన్ మాట్లాడుతూ.. బీసీ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తీసుకొచ్చి 42% బీసీ బిల్లు అమలు చేస్తూ, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జలజం రమేష్, ప్రభాకర్, శ్రీనివాసులు, రామ్మోహన్ జి పాల్గొన్నారు.
News October 18, 2025
మహబూబ్‌నగర్‌లో బీసీ జేఏసీ బంద్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం నిర్వహించారు. బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేతలు మాట్లాడుతూ.. బీసీ హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.