News August 5, 2024

MBNR: ఇందిరమ్మ పథకం.. 42 వేల మందికి లబ్ధి!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్ సర్కారు ప్రకటించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పథకం కింద ఒక్కో గృహం నిర్మాణానికి రూ.5 లక్షలు లబ్ధి దారులకు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాకు మొత్తం కలిపి 42 వేలకు పైగా ఇళ్లు మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా. వీటి నిర్మాణానికి రూ.2 వేల కోట్లకు పైగా నిధులు అవసరం కానున్నాయి.

Similar News

News November 22, 2025

UPDATE: MBNR: పీయూ.. పలు కోర్సుల ఫలితాలు

image

పాలమూరు వర్సిటీలోని పరిపాలన భవనములో బి.ఎడ్,ఎం ఫార్మసీ,బిపిఎడ్,ఎం ఫార్మసీ, LLB ఫలితాలను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ GN శ్రీనివాస్ విడుదల చేశారు.
✒బి.ఎడ్ 2వ సెమిస్టర్-71.98%
✒బి.ఎడ్ 4వ సెమిస్టర్- 93.48%
✒LLB 2వ సెమిస్టర్-68.85%
✒LLB 4వ సెమిస్టర్- 86.81%
✒బి.ఫార్మసీ 4వ సెమిస్టర్-60.40%
✒బీఫార్మసీ 6వ సెమిస్టర్-57.77%
✒ఎం.ఫార్మసీ 2వ సెమిస్టర్-72.22%
✒బిపిఎడ్ 2వ సెమిస్టర్-87.13%

News November 22, 2025

MBNR: పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ

image

పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ బీఏ,బీకాం,బీఎస్సీ, బీబీఏ బీఎ(L) (CBCS) సెమిస్టర్-I, III, V రెగ్యులర్, బ్యాక్‌లాక్ ఎగ్జామినేషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్స్‌కి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో ఆర్డర్ కాపీలను అందజేశారు. వీసీ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించామన్నారు.

News November 22, 2025

MBNR: డిగ్రీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ఉపకులపతి

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో శనివారం నుంచి నిర్వహించి డిగ్రీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అన్ని కేంద్రాలకు వెళ్లే ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్స్ స్క్వాడ్‌లకు ఆర్డర్ కాపీలను అందజేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏమైనా పొరపాట్లు జరిగితే ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కంట్రోలర్ డా కె ప్రవీణ తెలిపారు.