News March 30, 2024

MBNR: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు

image

మహబూబ్ నగర్ పట్టణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ పి వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పండ్లు అందించి ఉపవాస దీక్షను విరమించారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.

Similar News

News November 29, 2025

MBNR: పీయూలో కొత్త కాంటీన్‌ను ప్రారంభించనున్న వీసీ

image

PU విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన యూనివర్సిటీ క్యాంటీన్‌ను డిసెంబర్ 1న వైస్ ఛ ఛ ఛాన్స్‌లర్(వీసీ) ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహార వసతులను అందించేందుకు ఈ నూతన కాంటీన్‌ను ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు వీసీ తెలిపారు. కంట్రోలర్, ప్రిన్సిపాల్స్, విభాగ అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది హాజరు కావాలని రిజిస్ట్రార్ ప్రొ.పి.రమేష్ బాబు తెలిపారు.

News November 29, 2025

జడ్చర్ల: విద్యార్థిపై దాడి.. పాఠశాలకు నోటీసులు

image

జడ్చర్ల పట్టణంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి గురించి స్థానిక న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయగా స్పందించిన కమిషన్ పాఠశాలకు నోటీసు జారీ చేసింది. ఈ విషయంపై విచారణ జరిపి డిసెంబరు 12వ తేదీన నివేదికను అందజేయాలని డీఈఓ ను కోరినట్లు, న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ తెలిపారు.

News November 28, 2025

MBNR: AHTU.. NOVలో 24 కార్యక్రమాలు: ఎస్పీ

image

మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU)-2025 నవంబర్‌లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలలో మొత్తం 24 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. మహిళా భద్రత విభాగం హైదరాబాద్ ఆదేశాల మేరకు.. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్‌పోల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ఆపరేషన్ స్ట్రోమ్ మేకర్స్–3’ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.