News January 18, 2025
MBNR: ఇబ్బందులకు గురి చేసే అధికారులను ఉపేక్షించం: మంత్రి జూపల్లి

ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఉపేక్షించబోమని మంత్రి జూపల్లికృష్ణారావు హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి పెంట్లవెల్లికి వచ్చిన మంత్రికి రెవెన్యూ అధికారుల తీరుపై స్థానిక ప్రజలు, నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో సంబంధిత అధికారులు స్పందించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు.
Similar News
News February 12, 2025
MBNR: రెండు రోజులకు శవమై తేలింది!

ఇంట్లో గొడవపడి బయటికెళ్లిపోయిన మహిళ శవమై తేలిన ఘటన గండీడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. పగిడ్యాల్‌కి చెందిన పద్మమ్మ(38) ఆదివారం ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు అలిగి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత పగిడ్యాల్ మల్లమ్మచెరువులో శవమై తేలింది. పద్మమ్మకు భర్త, ముగ్గరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదైంది.
News February 12, 2025
MBNR: అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడూర్ మండల కేంద్రంలో నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన ఉప్పరి చిన్నయ్య (40) అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ విషయమై కేసు నమోదు కాలేదు.
News February 12, 2025
MBNR: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

లక్ష్మీనారాయణ కంపౌండ్‌లో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. జడ్చర్ల మండలం జయప్రకాశ్‌నగర్‌కు చెందిన శంకర్(33) ఇంటి నుంచి మేస్త్రీ పనికోసం బయలుదేరాడు. ఎప్పుడు.. ఎలా.. ఏం జరిగిందో తెలియదుకాని కాంపౌండ్ వద్ద రోడ్డుపై పడి మృతిచెందాడు. మృతుడికి మూర్ఛ వచ్చేదని, మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదైంది.