News September 11, 2024

MBNR: ఈనెల 12 న స్పాట్ అడ్మిషన్లు

image

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ,9వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 12న స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ఉమ్మడి జిల్లాల జోనల్ అధికారి నిర్మల మంగళవారం తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా NRPT, MBNR, GDL, WNPT, NGKL జిల్లాల్లోనిగురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Similar News

News December 18, 2025

MBNR: 19న “FSSAI లైసెన్స్,రిజిస్ట్రేషన్ మేళా”

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(FSSAI) లైసెన్స్ ,రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 19న నిర్వహించనున్నట్లు జిల్లా ఆహార తనిఖీ అధికారి నీలిమ తెలిపారు. ఈ మేళా మహబూబ్ నగర్ నందు ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయ సముదాయం(IDOC) గది నెం.218లో ఉదయం 11.00 గంటల నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివరాలకు 81212 59373, 70134 83730 నంబర్లకు సంప్రదించాలన్నారు.

News December 18, 2025

ఉమ్మడి జిల్లాలో ఈనాటి ముఖ్య వార్తలు

image

✒విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించాలి:ఎంపీ డీకే అరుణ
✒MBNR: సర్పంచ్ ఎన్నికలు.. రూ.11,08,250 సీజ్:SP
✒సర్పంచుల మరణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం:MLA అనిరుధ్ రెడ్డి
✒MBNR: రేపు అంబులెన్స్‌ డ్రైవర్ల నియామకానికి ఇంటర్వ్యూలు
✒T-20 క్రికెట్ లీగ్.. జట్ల ఎంపికలు పూర్తి
✒పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒పంచాయితీ పోరులో కాంగ్రెస్ హవా
✒MBNR: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

News December 18, 2025

MBNR: సర్పంచ్ ఎన్నికలు..70 నాఖాబందీ ఆపరేషన్లు

image

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా 70 నాఖాబందీ ఆపరేషన్లు, 37 ఆయుధాల డిపాజిట్, 640 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిందని, అలాగే రూ.7,200/- విలువగల ఉచితాల పంపిణీకి సంబంధించిన 1 కేసు, 3 ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులు, 4 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.