News September 11, 2024

MBNR: ఈనెల 12 న స్పాట్ అడ్మిషన్లు

image

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ,9వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 12న స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ఉమ్మడి జిల్లాల జోనల్ అధికారి నిర్మల మంగళవారం తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా NRPT, MBNR, GDL, WNPT, NGKL జిల్లాల్లోనిగురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Similar News

News October 13, 2024

MBNR: ఆలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న పాలమూరు నేతలు

image

మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దత్తాత్రేయ నిర్వహించిన కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. రానున్న రోజుల్లో ఆలయ్ బలయ్ కార్యక్రమాలు ఘనంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు.

News October 13, 2024

MBNR: ‘BRS కేజీ నుంచి పీజీ విద్య ఉచితమని చెప్పి.. చెవుల పువ్వు పెట్టింది’

image

BRS ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని ప్రజల చెవుల్లో పువ్వు పెట్టిందని NGKL ఎంపీ మల్లు రవి ఆదివారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఒక స్కూల్ నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తుందని గత ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసిందన్నారు. BRS నాయకులు రూ.7 లక్షల కోట్లు అప్పుచేసి తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు.

News October 13, 2024

కొండారెడ్డిపల్లిలో CM ప్రారంభోత్సవాలు ఇలా..

image

వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.55 లక్షలతో అమర జవాను యాదయ్య స్మారక గ్రంథాలయం, రూ.72 లక్షలతో నిర్మించిన కొత్త పంచాయతీ భవనం, రూ.45లక్షలతో BC సామాజిక భవనం, రూ.45 లక్షలతో చేపట్టిన పశు వైద్యశాల భవనాలను CM ప్రారంభించారు. సీఎం హోదాలో తొలిసారి వచ్చి రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.