News April 13, 2025
MBNR: ఈనెల 14లోగా దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

యువతకు ఉపాధి కల్పించేందుకుగానూ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసానికి ఆసక్తి గల వారంతా ఈనెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లాకలెక్టర్ విజయేంద్రబోయి శనివారం తెలిపారు. 21 నుంచి 60ఏళ్ల వరకు వయస్సున్న వారు రూ.లక్షన్నర వార్షిక ఆదాయం ఉన్న వారంతా సంబంధిత మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. యూనిట్ రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు ఉంటుందని ఆసక్తికలిగిన వారంతా సద్వినియోగపరుచుకోవాలన్నారు.
Similar News
News March 16, 2026
పాలమూరు: SZ.. రేపు KHO-KHO ఎంపికలు

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు KHO-KHO ఎంపికలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 17న పురుషులకు ఖో-ఖో ఎంపికలు నిర్వహిస్తామని, ముఖ్య అతిథిగా వీసీ జిఎన్.శ్రీనివాస్ హాజరవుతారన్నారు. 17-25 ఏండ్ల లోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ ప్రిన్సిపల్ సంతకంతో ఆ కళాశాల ఫిజికల్ డైరెక్టర్‌తో హాజరు కావాలన్నారు. SHARE IT
News March 16, 2026
MBNR: పీయూలో KHO-KHO సెలక్షన్స్

సౌత్ జోన్‌లో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ KHO-KHO స్త్రీల విభాగంలో ఎంపికలను సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జిఎన్.శ్రీనివాస్, రిజిస్టర్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు హాజరై మాట్లాడారు. మంచి ప్రదర్శన కనబరిచి యూనివర్సిటీకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. పీడీ డా.వై.శ్రీనివాసులు, ఖో-ఖో ప్రొఫెసర్ సత్య భాస్కర్ రెడ్డి, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
News March 15, 2026
బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలి: మాజీ మంత్రి

హైదరాబాద్ లక్డికపూల్‌లోని సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో నిర్వహించిన బీసీ సంఘాలు- ప్రజాప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.


