News April 18, 2024

MBNR: ఈనెల 21న ప్రవేశ పరీక్ష

image

సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 21న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ మహబూబ్ నగర్ తూర్పు ప్రాంతీయ సమన్వయకర్త విద్యుల్లత తెలిపారు. గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు జారీ చేసిన ప్రకటనతో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆన్లైన్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

Similar News

News September 9, 2024

MBNR: అక్రమాలపై ప్రత్యేక హైడ్రా ఫోకస్.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హైడ్రా ప్రకంపనలు మొదలయ్యాయి. CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో సర్వే, భూ దస్త్రాల శాఖ అప్రమత్తమైంది. పురపాలక సంఘాల్లో, గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగుల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి ఏ రోజుకు ఆ రోజు నివేదిక రూపంలో సాయంత్రం 4 గంటల వరకు కమిషనర్‌కు మెయిల్ పంపించాలని ఆదేశించారు. నివేదిక ఎలా ఇవ్వాలో నమూనాను కూడా పంపించారు. ఈ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది.

News September 9, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాతం వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా పెబ్బేరులో 35.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 26.3 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా 21.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 14.5 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా నవబ్‌పేటలో 9.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News September 9, 2024

MBNR: క్విజ్‌లో గెలిస్తే రూ.10లక్షలు

image

RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట జాతీయ స్థాయిలో క్విజ్ నిర్వహిస్తోంది. ఈ పోటిలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19 నుంచి 21 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 91 కళాశాలలు ఉన్నాయి. 40 వేల మందికిపైగా చదువుకుంటున్నారు. వీరంతా పాల్గొనే అవకాశం ఉంది.