News March 25, 2025
MBNR: ఈనెల 26వ తేదీన ఉద్యోగమేళ

ఈనెల 26వ తేదీన బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి మైత్రి ప్రియ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో నిర్వహించే ఈ ఉద్యోగమేళాకు విజయ ఫెర్టిలైజర్స్, ట్రెండ్స్, ధ్రువంత్ సొల్యూషన్స్ లాంటి సంస్థలు పాల్గొంటున్నాయని వెల్లడించారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన 30 ఏళ్లలోపు యువకులు అర్హులని వెల్లడించారు.
Similar News
News November 6, 2025
మహబూబ్నగర్: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సైబర్ జాగ్రుక్ దివస్ సందర్భంగా జడ్చర్లలోని మార్కెట్ యార్డులో అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమన్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే https://www.cybercrime.gov.inలో లేదా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
News November 6, 2025
MBNR: 42% రిజర్వేషన్ కోసం బీసీ JAC మౌన ప్రదర్శన

జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్ను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం జ్యోతిబా పూలే విగ్రహం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ నాయకులు బెక్కం జనార్దన్ మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు ఈ పోరాటం నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు, వివిధ సంఘాలకు జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
News November 6, 2025
పీయూకి నేడు మందకృష్ణ మాదిగ రాక

పాలమూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయ ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై దాడులకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమం ఈనెల 17న నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈ సమావేశంలో ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.


