News January 29, 2025
MBNR: ఈనెల 30న నిరుద్యోగులకు జాబ్ మేళా

మహబూబ్‌నగర్ లోని నిరుద్యోగులకు వివిధ ప్రవేట్ సంస్థల్లో 250 ఉద్యోగాల భర్తీకి ఈ నెల 30న జిల్లా ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు సర్టిఫికెట్స్‌తో పట్టణంలోని పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు.
Similar News
News February 17, 2025
NRPTలో అనుమానాస్పద స్థితిలో చిరుత మరణాలు.!

NRPT జిల్లాలో వేల ఎకరాలలో ఫారెస్ట్ విస్తరించి ఉంది. ఈమధ్య కాలంలో వన్యప్రాణుల సంతతి పెరుగుతోందని సంతోషించే లోపే చిరుతల అనుమానాస్పద మృతి ఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయి. మద్దూరు, దామరగిద్ద మండలాల్లో ఇటీవల ఐదు చిరుత పులులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. జాదరావుపల్లి, నందిపాడు ఉడుమల్గిద్ద, కంసాన్ పల్లి, వారం క్రితం ఉడ్మల్‌గిద్దలో నిన్న మోమినాపూర్‌లో అనుమానాస్పదంగా చిరుతలు మృత్యువాత పడ్డాయి.
News February 17, 2025
HAPPY BIRTHDAY KCR: CM రేవంత్ రెడ్డి

గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కాసేపటి క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోను తెలంగాణ CMO ట్వీట్ చేసింది.
News February 17, 2025
MBNR: వాహనం ఢీకొని యువకుడి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మిడ్జిల్ మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్సై శివనాగేశ్వర్‌నాయుడు తెలిపిన వివరాలు.. తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌కి చెందిన సోప్పరి రాఘవేందర్ మిడ్జిల్ మండలం చిల్వేర్‌లో పెళ్లికి వెళ్లి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మృతదేహాన్ని జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. మృతుడికి 10 నెలల క్రితమే పెళ్లయిందని స్థానికులు తెలిపారు.