News March 29, 2024
MBNR: ఈసారి 400 సీట్లు గెలుపు ఖాయం: కిషన్ రెడ్డి

రాష్ట్రంలో ప్రధాని మోదీ ప్రభంజనం మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఈసారి మోదీ ప్రభంజనంతో 400 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
Similar News
News November 27, 2025
బాలానగర్లో 13.5°C.. పెరిగిన చలి తీవ్రత

మహబూబ్నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో జిల్లాలోనే అత్యల్పంగా బాలానగర్లో 13.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్లో 13.8°C, దోనూరులో 13.9°C నమోదయ్యింది. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
News November 27, 2025
MBNR: నేటి నుంచి నామినేషన్లు.. ఇవి తప్పనిసరి.!

✒సంబంధిత ప్రాంతం ఓటర్ లిస్టులో పేరు ఉండాలి
✒21 ఏళ్ల వయస్సు ఉండాలి
✒నిర్ణీత డిపాజిట్ సొమ్ము చెల్లించాలి
✒నేర చరిత్ర, ఆస్తులు,అఫిడవిట్ పై అభ్యర్థి ఎలక్షన్ ఖర్చు,విద్యార్హతల అఫిడవిట్ ఇవ్వాలి
✒SC,ST,BC వారు కుల సర్టిఫికేట్ జతచేయాలి
✒అఫిడవిట్ పై అభ్యర్థి+2 సంతకాలు ఉండాలి
✒ఎలక్షన్ ఖర్చు నిర్వహిస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి
News November 26, 2025
MBNR: స్థానిక సంస్థల ఎన్నికలు.. ఎస్పీ కీలక సూచనలు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ డి.జానకి జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
✒అదనపు బందోబస్తు
✒24 గంటల విజిలెన్స్
✒డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీపై ప్రత్యేక నిఘా
✒అక్రమ రవాణా, గోప్యమైన కదలికలను అరికట్టేందుకు FFT, SST ప్రత్యేక టీమ్లు


