News October 18, 2024

MBNR: ఈ నెల 19న కరాటే ఎంపికలు

image

మహబూబ్ నగర్ పట్టణంలోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో ఈనెల 19న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాస్థాయి అండర్-14, అండర్-17 విభాగాల్లో బాలబాలికల కరాటే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయ్ తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ కార్డు జీరాక్సులతో హాజరు కావాలని సూచించారు.
-SHARE IT..

Similar News

News November 10, 2024

కురుమూర్తికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

image

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో కురుమూర్తి ఆలయానికి సీఎం చేరుకున్నారు. ఆలయానికి సంబంధించి రూ.110 కోట్లతో ఆలయ ఘాట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మెట్ల మార్గంలోనే కురుమూర్తి స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News November 10, 2024

MBNR: కులగణన.. వివరాల సేకరణలో 4,740 టీచర్లు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాల్లో 2,041కు పైగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న MBNR-1,156, NGKL-1,450, GDWL-606, NRPT-746, WNPT-782 మంది ఉపాధ్యాయులను అధికారులు సర్వేకు కేటాయించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒంటి పూటే కొనసాగగా.. మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు సర్వేకు వెళుతున్నారు.

News November 10, 2024

MBNR: జూ.అధ్యాపకుల ఎదురుచూపులు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికైన వారికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను వెల్లడించి 10 రోజుల్లో నియామక పత్రాలు అభ్యర్థులకు అందించింది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకుల భర్తీని పట్టించుకోవడంలేదని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. JL నియామక పత్రాలు వెంటనే అందజేయాలని కోరుతున్నారు.