News January 2, 2025

MBNR: ఈ న్యూ ఇయర్ ‘కిక్కే వేరబ్బా’

image

న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం ఏరులై పారింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి 31వరకు రూ.54.46 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 69,457 కాటన్ల బీర్లు, 52,630 కాటన్ల ఐఎంఎల్ లిక్కర్ విక్రయాలున్నాయి. దీంతో అబ్కారీశాఖకు భారీ ఆదాయం వచ్చింది. ఈ న్యూ ఇయర్ నేపథ్యంలో పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో Dec 31న MBNRలో 93, WNPలో 55, GWLలో 31, NRPTలో 22, NGKLలో 6 కేసులు నమోదు చేశారు.

Similar News

News February 24, 2026

జడ్చర్ల: భార్యభర్తల గొడ.. కత్తితో దాడి

image

భార్య, భర్త గొడవపడి ఇద్దరి అత్తలపై కత్తితో దాడి చేసిన ఘటన జడ్చర్ల మండలం పోలేపల్లిలో జరిగింది. సోమవారం రాత్రి పోలేపల్లికి చెందిన అలివేలు, రవి దంపతులు గొడవపడ్డారు. గొడవ ఆపేందుకు వచ్చిన అత్తలు శ్యామలమ్మ, అంజమ్మలపై రవి కత్తి మొఖం, కడుపులో దాడి చేయగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News February 23, 2026

MBNR: పీఎం శ్రీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువుపై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.

News February 23, 2026

పాలమూరు: మత్తు వదలండి.. మైదానాలు చేరండి: మంత్రి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలకు మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచాన్ని వదిలి క్రీడలపై ధ్యాస పెడితే ప్రపంచం మొత్తం తమ వైపు చూస్తుందన్నారు. 33 జిల్లాల నుంచి సుమారు 1,200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.