News March 29, 2025

MBNR: ఉగాది.. షడ్రుచుల సమ్మేళనం!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉగాది పండగకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉగాది అంటేనే గుర్తుకొచ్చేది పచ్చడి. ఉగాది పచ్చడి.. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనం. ఉగాది పచ్చడి అనేది జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది అని పెద్దల నమ్మకం. ఉగాది/యుగాది, సంవత్సరాది అని పిలుస్తారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయాలు ముస్తాబు చేశారు.

Similar News

News October 18, 2025

MBNR: బీసీ బిల్లును అమలు చేయాలి

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ దగ్గర శనివారం బీసీ ఉమ్మడి జిల్లా జేఏసీ ఛైర్మన్ బెక్కం జనార్దన్, వివిధ సంఘాల నాయకులు బీసీ బంద్‌ను నిర్వహించారు. జేఏసీ ఛైర్మన్ మాట్లాడుతూ.. బీసీ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తీసుకొచ్చి 42% బీసీ బిల్లు అమలు చేస్తూ, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జలజం రమేష్, ప్రభాకర్, శ్రీనివాసులు, రామ్మోహన్ జి పాల్గొన్నారు.

News October 18, 2025

మహబూబ్‌నగర్‌లో బీసీ జేఏసీ బంద్

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం నిర్వహించారు. బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేతలు మాట్లాడుతూ.. బీసీ హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

News October 17, 2025

పాలమూరు యూనివర్శిటీ వీసీగా ఏడాది పూర్తి

image

పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తైంది. ఈ ఏడాదిలో వర్శిటీ విద్యా, పరిపాలనా రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. వీసీ బాధ్యతలు చేపట్టిన వెంటనే నాక్ (NAAC) గ్రేడింగ్‌కు వెళ్లడం, లా కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజీలను స్థాపించడం వంటి కీలక చర్యలు చేపట్టారు. ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఏడాది 100% అడ్మిషన్లు జరిగాయి.