News September 7, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో ఈ మండలాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా!

image

ఉమ్మడి జిల్లాలో నిరక్షరాస్యుల సంఖ్య 2011లో 7,78,184 ఉండగా ఇప్పుడు 10 లక్షలు దాటింది. GDWLలో కేటీదొడ్డి, గట్టు, ధరూర్, NRPTలోని దామరగిద్ద, మద్దూరు, కోస్గి, NGKLలోని బిజినేపల్లి, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, అచ్చంపేట, మన్ననూరు, అమ్రాబాద్, పదర, WNPTలో ఖిల్లాఘణపూర్, పెద్దమందడి, MBNRలో కోయిలకొండ, గండీడ్, బాలన గర్ మండలాల్లో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవంగా ప్రత్యేక కథనం.

Similar News

News October 14, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా”TODAY TOP NEWS”

image

✓BRS కేజీ టు పీజీ విద్యా ఉచితమని చెవిలో పూలు: ఎంపీ మల్లు రవి.
✓ కొడంగల్: దసరా పండుగకు కార్యకర్తలు నాయకులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.
✓ దసరా సండే స్పెషల్ కిక్కిరిసిపోయిన మద్యం, మటన్ షాపులు.
✓బొంరాస్ పేట: బైకు- కారు ఢీకొని వ్యక్తి మృతి.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దుర్గామాత అమ్మవారి శోభాయాత్ర.
✓ అలయ్- బలయ్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా నేతలు.

News October 13, 2024

MBNR: ఆలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న పాలమూరు నేతలు

image

మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దత్తాత్రేయ నిర్వహించిన కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. రానున్న రోజుల్లో ఆలయ్ బలయ్ కార్యక్రమాలు ఘనంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు.

News October 13, 2024

MBNR: ‘BRS కేజీ నుంచి పీజీ విద్య ఉచితమని చెప్పి.. చెవుల పువ్వు పెట్టింది’

image

BRS ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని ప్రజల చెవుల్లో పువ్వు పెట్టిందని NGKL ఎంపీ మల్లు రవి ఆదివారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఒక స్కూల్ నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తుందని గత ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసిందన్నారు. BRS నాయకులు రూ.7 లక్షల కోట్లు అప్పుచేసి తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు.