News October 1, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న అమ్మాయిలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3ఏళ్లుగా జననాల రేటులో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. గత ఏడాదిలో బాలురు 28,891 జననాలు నమోదు కాగా.. అమ్మాయిలు 25,822 మంది మాత్రమే మాత్రమే జన్మించారు. పలు స్కానింగ్ కేంద్రాల్లో బేబీ జెండర్ గురించి చెప్తున్నట్లు సమాచారం. ఇలాగైతే బాలికల శాతం తగ్గనుంది. బాలికల కోసం సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ స్కానింగ్ కేంద్రాలు తనిఖీలు చేస్తున్నామని DMHO పద్మా తెలిపారు.

Similar News

News November 15, 2025

MBNR: ఆ పదవి కోసం.. ఆశావాహులు ఎదురుచూపులు!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎనిమిది నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ పదవి కోసం సీనియర్ నాయకులు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు ఎన్నిక జరగకపోవడంతో ఆశావాహులు నిరాశ చెందారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎప్పుడు ఈ పదవులను భర్తీ చేస్తుందోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.

News November 15, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ దుర్మరణం

image

అడ్డాకుల మండలం రాచాల సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలీ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చౌడాయపల్లికి చెందిన మహిళా కూలీలు ఆటోలో వస్తుండగా, ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కూలీ పద్మ(30) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మహిళ బురమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న వినయ్‌కు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News November 15, 2025

ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. MBNRలో ఇదీ పరిస్థితి..!

image

MBNR జిల్లాలో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అత్యల్పంగా బాలానగర్ మండల కేంద్రంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్‌లో 11.1, గండీడ్ మండలం సల్కర్‌పేటలో 11.3, మిడ్జిల్‌లో 12.3, కోయిలకొండ సిరివెంకటాపుర్, భూత్‌పూర్‌లో 12.7, మహ్మదాబాద్‌లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.