News August 29, 2024
MBNR: ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వర్షం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తుంది. MBNR, NGKL, వనపర్తి, కొడంగల్, జడ్చర్ల, కోస్గి, కల్వకుర్తి, నారాయణపేట తదితర ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మీ మండలంలో వర్షం పడుతుందా..? కామెంట్ చేయండి.
Similar News
News October 13, 2025
MBNR: జాగ్రత్త.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మంగళవారం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు పడవచ్చని పేర్కొంది. ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి అలుగు పారాయి. ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News October 13, 2025
MBNR ఇంటర్ విద్యార్థి సూసైడ్

మహబూబ్ నగర్ మండలంలోని రామ్ రెడ్డి కూడా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రియాంక (16) బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక స్వస్థలం గద్వాల జిల్లా మల్దకల్. తనకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పగా.. సోమవారం వస్తామని చెప్పగా అంతలోనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు విలపించారు. చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
News October 13, 2025
MBNR: నీటి సమస్యనా.. ఫోన్ చేయండి

మహబూబ్ నగర్ నగర పాలక సంస్థ పరిధిలోని నీటి సమస్యలు ఉంటే ఫోన్ చేయాలని నగర పాలక సంస్థ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. నగర పాలక సంస్థ పరిధిలోని పైప్ లైన్ లీకేజిలు, తాగునీటి సరఫరా, పబ్లిక్ బోర్ రిపేర్, వీధి దీపాలు వంటి సమస్యలకు Toll free నంబర్ 7093911352 కాల్ చేయాలన్నారు. ఉదయం 09:00 నుంచి సాయంత్రం 06:00 వరకు అందుబాటులో ఉంటారన్నారు.