News March 20, 2025

MBNR: ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!

image

✔పదేళ్లలో BRSది విధ్వంస పాలన: మంత్రి జూపల్లి✔నాగర్‌కర్నూల్: SLBCలో పనులు వేగవంతం: కలెక్టర్✔MBNR: PUలో పలు విభాగాల్లో అధిపతుల నియామకం✔TG KHO-KHO జట్టు కెప్టెన్‌గా పీడీ బి.రూప(మక్తల్)✔GET READY.. టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం✔బిజినపల్లి: జాతీయ జెండాకు అవమానం.. డీఈవో వివరణ✔కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్✔ముగిసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు

Similar News

News November 30, 2025

బొబ్బరోనిపల్లి: 20 ఏళ్లుగా ఒకే కుటుంబం..!

image

దుగ్గొండి మండలం బొబ్బరోనిపల్లిలో సర్పంచ్ పదవి 20 ఏళ్లుగా ఒకే కుటుంబం చేతిలోనే కొనసాగుతోంది. 1994లో పంచాయతీ ఏర్పడిన తర్వాత 1995, 2013లో శంకేసి పద్మ, శంకేసి శోభ కమలాకర్ ఏకగ్రీవంగా గెలిచారు. 2001లో పద్మ భర్త నర్సింహాస్వామి, 2019లో కమలాకర్ విజయం సాధించారు. ఈసారి సర్పంచ్ పదవి జనరల్‌కు రావడంతో శోభ భర్త కమలాకర్ మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా, ఫలితంపై గ్రామంలో ఆసక్తి పెరిగింది.

News November 30, 2025

WGL: ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనొద్దు..!

image

ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. 3 విడతల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ కఠిన నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులు సర్పంచ్, వార్డు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా రాజీనామా చేయాలని స్పష్టం చేసింది. ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ పథక సిబ్బంది, గోపాలమిత్రలు, సీసీలు, కమ్యూనిటీ మొబిలైజర్లు వంటి వర్గాలు ఏ అభ్యర్థి ప్రచారంలోనూ పాల్గొన్న ఉద్యోగం పోతుంది.

News November 30, 2025

ఈ జిల్లాల ప్రజలు బయటకు రాకండి!

image

AP: దిత్వా తుఫాను భారత్ వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA పేర్కొంది. ‘కోస్తాతీరం వెంబడి గంటకు 45-65 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. NLR, TPT జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే బయటికి వెళ్లండి. అత్యవసర సహాయం కోసం నెల్లూరు, కడప, వెంకటగిరిలో NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయి’ అని తెలిపింది.