News November 6, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔GET READY..రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ✔11న కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ✔NRPT:చిరుతపులి దాడిలో మేకలు మృతి ✔MBNR:పీఎంశ్రీకి 119 పాఠశాలలు ఎంపిక ✔కడ్తాల్: మహిళ మృతదేహం లభ్యం ✔MBNR:ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ప్రారంభమైన రాజకీయ వేడి ✔GDWL:సెల్ ఫోన్ల రికవరీలో పోలీసుల ఉత్తమ ప్రతిభ ✔ప్రతి ఇంటిపై స్టిక్కర్లు అతికించాలి:కలెక్టర్లు ✔కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్:AITUC

Similar News

News December 7, 2025

గల్లంతైన ఆరు గ్యారంటీలు: డీకే అరుణ

image

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు పెట్టి గెలిచారని మహబూబ్ నగర్ డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తిగా గల్లంతయ్యాయని విమర్శించారు. రెండు సంవత్సరాల విజయోత్సవాలు జరుపుకునే అర్హత వారికి లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.

News December 7, 2025

MBNR: కాంగ్రెస్ ప్రజా వంచన పాలన: MP

image

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హామీలు అమలుచేయకుండా ప్రజావంచన పాలన కొనసాగిస్తుందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఇందిరాపార్క్ దగ్గర బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగభృతి, మహిళలకు రూ.2,500, తులం బంగారం, ఎలక్ట్రికల్ స్కూటీలు తదితర పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు.

News December 7, 2025

MBNR: రెండో దశలో 239 మంది సర్పంచ్‌ల విత్‌డ్రా

image

స్థానిక సంస్థల రెండో దశ ఎన్నికల్లో మొత్తం 239 మంది సర్పంచ్‌ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 151 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు పేర్కొన్నారు. హన్వాడ మండలంలో అత్యధికంగా 58 మంది, కోయిలకొండలో 55 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.