News August 19, 2024
MBNR: ఉమ్మడి జిల్లాలో రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రేపు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.
Similar News
News December 10, 2025
నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ

నిష్పక్షపాతంగా ప్రతి అధికారి విధులు నిర్వహించాలని ఎస్పీ జానకి బుధవారం సూచించారు. రేపు మొదటి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వికలాంగులకు సహాయ సహకారాలు అందించాలని, ఎల్లప్పుడూ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ ఉండాలని సూచించారు.
News December 10, 2025
మహబూబ్నగర్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

మహబూబ్నగర్ జిల్లాలో గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. గండీడ్ మండలం సల్కర్పేటలో అత్యల్పంగా 9.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిడ్జిల్ మండలం దోనూరులో 9.3, మిడ్జిల్లో 10.1, కోయిలకొండ సిరి వెంకటాపురం, భూత్పూర్లో 10.5, దేవరకద్రలో 10.9, కొత్త మొల్గరలో 11.4, జానంపేటలో 11.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News December 10, 2025
MBNR: మూడో విడతలో 440 మంది సర్పంచ్ అభ్యర్థులు.!

మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత పోరు రసవత్తరంగా మారింది. ఈ విడతలో మొత్తం 440 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. అడ్డాకల్, బాలానగర్, భూత్పూర్, జడ్చర్ల, మూసాపేట మండలాలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జడ్చర్ల మండలానికి సంబంధించి ఒక గ్రామ పంచాయతీలో నామినేషన్ సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు.


