News March 22, 2024
MBNR: ఎన్నికల కోడ్ ముగిశాకే గృహజ్యోతి

ఉమ్మడి MBNR జిల్లాలో గృహజ్యోతి పథకం అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. రాష్ట్రమంతట గృహ జ్యోతి అమలు అవుతుండగా కేవలం MBNR జిల్లాలో మాత్రమే అమలు కాకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. CM రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 27న గృహ జ్యోతి పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఫిబ్రవరి 26న ఉమ్మడి జిల్లాలో MLC కోడ్ రావడంతో తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో కోడ్ ముగిశాకే గృహజ్యోతి అమలు కానుంది.
Similar News
News November 10, 2025
MBNR:FREE కోచింగ్.. అప్లై చేస్కోండి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని యువకులకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’తో తెలిపారు. ‘జూనియర్ బ్యూటీ పార్లర్ ప్రాక్టీషనర్’లో ఉచిత శిక్షణ, వసతి ఇస్తున్నామని, వయసు 19-45లోపు ఉండాలని, ఆసక్తి గలవారు. SSC MEMO, రేషన్, ఆధార్‌కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 12లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 98481 42489కు సంప్రదించాలన్నారు.
News November 10, 2025
MBNR: సాఫ్ట్‌బాల్.. 2nd PLACE

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్లో మహబూబ్ నగర్ మహిళా సీనియర్ సాఫ్ట్ బాల్ జట్టు ద్వితీయ స్థానంలో(రజతం) నిలిచింది. తెలంగాణ సాఫ్ట్ బాల్ సెక్రటరీ శోభన్ బాబు చీఫ్ గెస్ట్‌గా హాజరై జట్టును అభినందించారు. జగిత్యాలలోని ఈ నెల 7 నుంచి 9 వరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ జరిగింది. పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
News November 9, 2025
BREAKING.. MBNR: ట్రాక్టర్, ఆటో ఢీ.. మహిళ మృతి

మిడ్జిల్ మండలం బోయిన్పల్లి-మల్లాపూర్ రోడ్డులో ఆటోను పత్తి లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో మల్లాపూర్‌కు చెందిన వడ్డే మల్లీశ్వరి (21) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలికి ఆరు నెలల వయసున్న కవల పిల్లలు (బాలుడు, బాలిక) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


