News June 3, 2024

MBNR: ఎన్నికల ఫలితాలను ఇలా తెలుసుకోవచ్చు

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని MBNR, NGKL నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో తమ తమ నియోజకవర్గాల్లోని ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఎన్నికలసంఘం అధికారిక వెబ్ సైట్ results.eci.gov.inను అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు కూడా వెబ్‌సైట్‌ను సంప్రదించి ఫలితాలను తెలుసుకోండి

Similar News

News September 17, 2024

వనపర్తి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరారు.. గ్రామానికి సమీపంలోని పోగాకు కంపెనీ వద్ద జాతీయ రహదారిపై హైదారాబాద్ నుంచి కర్నూల్ ​వెళ్తున్న ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సు, టీవీఎస్​ ఎక్స్​ఎల్​ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎక్స్ ఎల్ పై ఉన్న పెండ్లి రాముడు అక్కడిక్కడే మృతి చెందగా శేఖర్ ఆసుపత్రికు తరలిస్తున్న మార్గమధ్యలో మృతి చెందాడు

News September 17, 2024

MBNR: క్విజ్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే!

image

☞సురవరం <<14119741>>ప్రతాపరెడ్డి <<>>జన్మించిన గ్రామం? – ఇటిక్యాలపాడు
☞ఉమ్మడి జిల్లాలో ఏర్పాటైన తొలి ప్రాజెక్టు? – కోయిల్‌సాగర్
☞‘శతపత్రం’ పుస్తకాన్ని ఎవరు రచించారు? – రామకృష్ణశర్మ
☞గద్వాల కోటను ఎవరు నిర్మించారు? – రాజా పెద్ద సోమభూపాలుడు, 1666
☞శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారు? – రాజా బహిరీ గోపాలరావు
SHARE IT..

News September 17, 2024

ప్రజా పాలనను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాం: జూపల్లి

image

ప్రజా పాలన అంటే ఇలా ఉంటుందో ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 6 గ్యారంటీల అమలుపైనే తమ దృష్టి అంతా ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.