News February 19, 2025
MBNR: ఎముక గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

పెళ్లిలో భోజనం చేస్తుండగా.. ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బాలానగర్ మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. MBNR మండలం దొడ్డలోనిపల్లికి చెందిన జహంగీర్(49) తిర్మలాయకుంటతండాలో ఓ పెళ్లికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా.. గొంతులో ఎముక ఇరుక్కుని కిందపడిపోయాడు. అక్కడున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News March 18, 2025
27 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

AP: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్స్ అందించాలని ఈవో శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. తొక్కిసలాట జరగకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్యూలైన్లు, పాతాళగంగ తదితర ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
News March 18, 2025
గవర్నర్‌ను కలిసిన కోనసీమ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ కోరుకొండ సత్యనారాయణ కలిశారు. మంగళవారం విజయవాడలో రెడ్ క్రాస్ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు కోనసీమ రెడ్ క్రాస్ ఛైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు. కోనసీమలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి గవర్నర్‌కు వివరించారు.
News March 18, 2025
ఈడీ వద్దకు చేరిన బెట్టింగ్ యాప్స్ కేసు

బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఈడీ ఆరా తీసింది. చెల్లింపుల వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకుంది. హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. 11 మంది వివరాలు సేకరించి.. ఎవరెవరికి ఎంత డబ్బులు ముట్టాయని ఈడీ ఆరా తీస్తోంది.