News February 19, 2025
MBNR: ఎముక గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

పెళ్లిలో భోజనం చేస్తుండగా.. ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బాలానగర్ మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. MBNR మండలం దొడ్డలోనిపల్లికి చెందిన జహంగీర్(49) తిర్మలాయకుంటతండాలో ఓ పెళ్లికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా.. గొంతులో ఎముక ఇరుక్కుని కిందపడిపోయాడు. అక్కడున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News December 23, 2025
జ్యోతిబా ఫూలే విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

సిరిసిల్లలోని మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యాలయంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. స్టోర్ రూమ్, వంటశాల నుంచి తరగతి గది వరకు ఆమె నిశితంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేయాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి ఆరో తరగతికి సంబంధించిన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.
News December 23, 2025
కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో డిఫెన్స్‌లోకి రేవంత్ సర్కార్: హరీశ్ రావు

తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో రేవంత్ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందన్నారు. పేదల సమస్యలు వదిలి షోలు, సమ్మిట్‌లతో కాలం గడుపుతోందని ఆరోపించారు. కో ఆపరేటివ్ ఎన్నికలు తప్పించుకుంటూ భయంతో పాలన సాగుతోందన్నారు.
News December 23, 2025
శివాజీ కామెంట్స్.. మంచు మనోజ్ క్షమాపణలు

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు <<18648181>>శివాజీ చేసిన కామెంట్లు<<>> తీవ్ర నిరాశకు గురిచేశాయని మంచు మనోజ్ తెలిపారు. ‘మహిళల దుస్తుల విషయంలో జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు. గౌరవం, జవాబుదారీతనం వ్యక్తిగత ప్రవర్తనతోనే వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘించడమే. ఆ సీనియర్ నటుడి తరఫున నేను క్షమాపణలు చెబుతున్నా. మహిళలు గౌరవం, మర్యాద, సమానత్వానికి అర్హులు’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


