News February 19, 2025

MBNR: ఎముక గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

image

పెళ్లిలో భోజనం చేస్తుండగా.. ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బాలానగర్‌ మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. MBNR మండలం దొడ్డలోనిపల్లికి చెందిన జహంగీర్(49) తిర్మలాయకుంటతండాలో ఓ పెళ్లికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా.. గొంతులో ఎముక ఇరుక్కుని కిందపడిపోయాడు. అక్కడున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News October 14, 2025

అత్యధిక మంది చూసిన సినిమాగా ‘వార్-2’

image

జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్-2’ ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఆర్మాక్స్ లెక్కల ప్రకారం గత వారం ఇండియాలో అత్యధిక మంది చూసిన సినిమాగా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రానికి అత్యధికంగా 3.5 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు పేర్కొంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ అంచనాలతో తెరకెక్కిన వార్-2 థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

News October 14, 2025

చిత్తూరు జిల్లాలో TDPని చుట్టుముడుతున్న వివాదాలు

image

చారిత్రాత్మక విజయం అనంతరం జిల్లాలో TDP బలోపేతం అవుతుందని అందరూ భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అంబేడ్కర్ విగ్రహ దహనం, నకిలీ లిక్కర్ స్కామ్, మహిళలపై లైంగిక వేధింపులతోపాటూ వారి వ్యక్తిగత వీడియోలు తీసిపెట్టాలనే ఆరోపణలు జిల్లాలోని కూటమి MLAల మెడకు చుట్టుకుంటున్నాయి. శుభమా అని అన్ని సీట్లు గెలిచిన TDPలో ఏడాదిన్నరలోపే వివాదాలు రేగడం అధిష్ఠానం వైఫల్యమే అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News October 14, 2025

ADB: 2 వారాలు.. 26 మోసాలు.. మీరూ జాగ్రత్త..!

image

ఇచ్చోడ మండల కేంద్రం నుంచి ఒకరు ట్రాన్స్‌‌ఫోర్ట్ కావాలని ఆన్‌లైన్‌లో వెతకగా నకిలీ కస్టమర్ కేర్ వ్యక్తులు బాధితున్ని సంప్రదించారు. ఆదిలాబాద్ రూరల్ మండలానికి చెందిన ఒక వ్యక్తికి కేరళ లాటరీ రూ.5 లక్షలు వచ్చిందంటూ సైబరాసురులు మోసాలకు పాల్పడ్డారు. జిల్లాలో 2వారాల వ్యవధిలో 26మోసాలు జరిగాయంటే అమాయకులు ఎలా మోసపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.