News February 19, 2025

MBNR: ఎముక గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

image

పెళ్లిలో భోజనం చేస్తుండగా.. ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బాలానగర్‌ మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. MBNR మండలం దొడ్డలోనిపల్లికి చెందిన జహంగీర్(49) తిర్మలాయకుంటతండాలో ఓ పెళ్లికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా.. గొంతులో ఎముక ఇరుక్కుని కిందపడిపోయాడు. అక్కడున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News April 10, 2026

మహబూబ్‌నగర్: రోడ్డు భద్రతపై వీడియో పోటీలు

image

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు “Arrive Alive” పేరుతో వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. గరిష్ఠంగా 3 నిమిషాల నిడివి గల వీడియోలను రూపొందించి, ఈ నెల 14లోపు ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఉత్తమ వీడియోకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని, ప్రమాదాల నివారణే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.

MBNR: పెరుగుతున్న ఎండలు.. ప్రజల బెంబేలు

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో 41.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. భూత్పూర్ మండలం కొత్త మొల్గర 40.7, కౌకుంట్ల 40.6, భూత్పూర్ 40.3, నవాబుపేట 45.2, చిన్న చింతకుంట 40.0, మూసాపేట మండలం జానంపేట 39.7, అడ్డాకుల, మహమ్మదాబాద్, దేవరకద్ర 39.6, మిడ్జిల్ మండలం దోనూరు, మహబూబ్ నగర్ గ్రామీణం 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.