News June 2, 2024
MBNR: ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 1439 ఓటర్లు ఉండగా అందులో 1437 ఓట్లు పోలయ్యాయి. జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్‌ఎస్ నుంచి నవీన్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి పోటీ చేశారు. ఈ ఫలితాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News July 6, 2025
తెలుగు విశ్వవిద్యాలయం.. పరీక్షల తేదీలు ఖరారు

తెలుగు విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పరీక్ష షెడ్యూల్ నేడు విడుదల చేశారు. BFA, బి.డిజైన్, (సెమిస్టర్-2,4,6); PG. డిప్లొమా ఇన్ యోగ, MA, MFA, MCA, MAJ &MC, ఎం.డిజైన్ (సెమిస్టర్-2) కోర్సులకు మొదటి, 2వ సెమిస్టర్ (రెగ్యులర్/ బ్యాక్ లాగ్/ఇంప్రూవ్మెంట్) పరీక్షలు జులై/ఆగస్టులో నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు ఈనెల 19న చివరి తేదీ. రూ.100 ఫైన్ తో 23 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
News July 5, 2025
NRPT: అథ్లెటిక్స్ ఆడెందుకు బయలుదేరిన క్రీడాకారులు

తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఆడిందుకు నారాయణపేట జిల్లా క్రీడాకారులు శనివారం బయలుదేరారు. హనుమకొండలో రేపటి నుంచి ప్రారంభమయ్యే “Trithalon అథ్లెటిక్స్” అండర్-10, 12, 14 విభాగంలో 60 మీ. రన్నింగ్, లాంగ్ జంప్, జావిలిన్ త్రో తదితర క్రీడల్లో 20 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మండల విద్యాధికారి కృష్ణారెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ రమణ బెస్ట్ విషెస్ తెలిపారు.
News July 5, 2025
MBNR: BJP కొత్త సారథి.. అభినందించిన డీకే అరుణ

హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాలమూరు ఎంపీ, జాతీయ కౌన్సిల్ మెంబెర్ డీకే అరుణ నూతన ఆయన్ను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.