News March 30, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు 200 ఓట్ల మెజార్టీ..?

image

ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి 200 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థికి 200 ఓట్ల మెజార్టీ సాధ్యమేనా అనే చర్చ సాగుతుంది. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 800కు పైగా ఓట్లు ఉంటే కాంగ్రెస్‌కు 400 పైచిలుకు ఓట్లు ఉన్నాయి.

Similar News

News February 11, 2026

మహబూబ్‌నగర్ జిల్లాలో 69.5% ఓటింగ్ నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 పురపాలికలు, 1 నగరపాలికలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 69.05 ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దేవరకద్రలో 85.51 శాతం ఓటింగ్, భూత్పూర్‌లో 84.58 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అలాగే మహబూబ్‌నగర్ నగరపాలికలో 67.73% ఓటింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.

News February 11, 2026

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఏపీ జితేందర్ రెడ్డి

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం 44 డివిజన్ పంచాయితీ రాజ్ కాలనీలోని పోలింగ్ బూత్‌లో ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News February 11, 2026

MBNR:మోడల్ స్కూల్.. అప్లై చేసుకోండి

image

మహబూబ్ నగర్(D) గండీడ్ మండలం వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్) చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా “Way2News” ప్రతినిధితో తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7,8,9,10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, https://tgms.telangana.gov.in వెబ్ సైట్‌లో ఈనెల 28లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.