News March 28, 2025

MBNR: ఎల్ఆర్ఎస్‌కు గడువు మూడు రోజులే… 51,490 దరఖాస్తులు

image

LRS దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం విధించిన గడువు 3రోజుల్లో ముగియనుంది. కానీ దరఖాస్తులేమో 51,490 పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తుల్ని పరిష్కరించుకునే వారికి ప్రభుత్వం 25% రాయితీ ప్రకటించిన దరఖాస్తుదారుల్లో ఏమాత్రం స్పందన కనిపించడంలేదు. వీరికి అవకాశం కల్పిస్తే తమకు ఆదాయం వస్తుందని భావించిన ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. MBNRలో 29,390, జడ్చర్ల 16,500, భూత్పూర్ 5,600 ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి.

Similar News

News April 5, 2025

పాలమూరు నేతలతో KCR మీటింగ్.. BRS శ్రేణుల్లో జోష్..!

image

ఏప్రిల్ 27న వరంగల్‌లో BRS భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో MBNR, GDWL, NRPT, NGKL, WNP జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ MLAలు,ఇతర ముఖ్య నేతలతో ఈరోజు మాజీ సీఎం KCR సమావేశం నిర్వహించారు. జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న KCR ప్రజాక్షేత్రంలోకి వస్తుండడంతో BRSశ్రేణుల్లో జోష్ నిండింది. భారీగా సభకు తరలివెళ్లి పాలమూరు సత్తా చాటుతామని నేతలు తెలిపారు.

News April 5, 2025

MBNR: PU నివేదిక ఇవ్వండి: CM 

image

విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే కోర్సులు ఉండాల‌ని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల బోధ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స‌ల‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఐసీసీసీలో శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ జి.ఎన్‌.శ్రీ‌నివాస్‌ పాల్గొన్నారు. అవ‌స‌ర‌మైన నిధుల, భ‌వ‌నాల నియామ‌కాలపై నివేదిక ఇవ్వాలన్నారు.

News April 5, 2025

MBNR: ప్రేమించాడని యువకుడిపై దాడి

image

నవాబుపేట మండలంలో యువతిని ప్రేమించాడని యువకుడిపై దాడి జరిగిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. పల్లెగడ్డకు చెందిన అరవింద్ పాత పాలమూర్‌కు చెందిన యువతిని ప్రేమించాడు. విషయం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారు అరవింద్‌ను మాట్లాడుదామని గ్రామం బయటికి తీసుకెళ్లి దాడి చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

error: Content is protected !!