News April 10, 2025

MBNR : ఏప్రిల్ 12వ తేదీ నుంచి 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న డా.బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలలో డిగ్రీ థర్డ్ ఇయర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులకు 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభమై 19వ తేదీ వరకు జరుగుతాయని MVS కళాశాల ప్రిన్సిపల్ డా.Dk.పద్మావతి & మహబూబ్ నగర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Similar News

News November 20, 2025

నేడే ఫెస్ట్.. HYD వస్తున్న ఉత్తర, తూర్పు భారత ప్రజలు

image

ఉత్తర, తూర్పు భారతదేశ నలు మూలల నుంచి గౌరవనీయ ప్రతినిధులు తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో, కల్చరల్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు HYD చేరుకుంటున్నారు. రాజ్‌భవన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈ విశిష్టోత్సవం నేడు ప్రారంభం కానుంది. సాంకేతికతతో పాటు సంస్కృతిని కలగలిపే ఈ వేడుకలో తాజా అప్డేట్స్‌ కోసం వేచి ఉండండి.

News November 20, 2025

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు అధికారుల వెల్లడించారు. బీబీపేట్ 8.9°C, గాంధారి 9.9, మేనూరు, లచ్చపేట, నస్రుల్లాబాద్ 10, రామారెడ్డి, రామలక్ష్మణపల్లి, డోంగ్లి 10.1, జుక్కల్, బొమ్మన్ దేవిపల్లి 10.2, సర్వాపూర్ 10.3, నాగిరెడ్డిపేట, బిచ్కుంద, బీర్కూర్ 10.5, లింగంపేట 10.8°C నమోదైంది.

News November 20, 2025

ఫస్ట్ వింగ్‌కమాండర్ డా.విజయలక్ష్మి రమణన్‌

image

భారత వైమానిక దళ మొదటి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్‌. 1924లో జన్మించిన ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుని చెన్నైలోని ఎగ్మోర్ ఆసుపత్రిలో సేవలందించారు. 1955లో ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో చేరి గైనకాలజిస్ట్‌గా, తొలి మహిళా అధికారిణిగా నియమితులయ్యారు. 1962, 1966, 1971 యుద్ధాల్లో గాయపడిన సైనికులకు ఆమె చికిత్స అందించారు. 1977లో విశిష్ట సేవా అవార్డును అందుకున్న ఆమె 1979లో పదవీ విరమణ చేశారు.