News April 10, 2025

MBNR: ఏప్రిల్ 12 నుంచి 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న డా.బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ థర్డ్ ఇయర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులకు 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభమై 19వ తేదీ వరకు జరుగుతాయని MVS కళాశాల ప్రిన్సిపల్ డా.Dk.పద్మావతి, రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు.

Similar News

News April 19, 2025

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

image

ఛానల్ అప్డేట్స్, మెసేజ్‌లను ఇతర భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకోగలిగే ఫీచర్‌‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. లేటెస్ట్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకుని ట్రాన్స్‌లేషన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాక్టివేట్ చేసుకోవాలి. హిందీ సహా స్పానిష్, రష్యన్, అరబిక్ తదితర విదేశీ భాషలు సైతం అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో రోల్ ఔట్ కానుంది.

News April 19, 2025

శ్రీనగర్ ASPగా కర్నూల్ వాసి.!

image

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌‌లోని శ్రీనగర్ ASPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ ASPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

News April 19, 2025

‘జాట్‌’లో ఆ సీన్ తొలగింపు

image

జాట్‌లో ఓ సీన్ తమ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందంటూ క్రైస్తవులు ఆరోపించడంతో ఆ సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు మూవీ టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఎవరి మనోభావాల్ని గాయపరచడం మా ఉద్దేశం కాదు. ఆ సన్నివేశం పట్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించాలని కోరుతున్నాం’ అని అందులో పేర్కొన్నారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్‌ను తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించారు.

error: Content is protected !!