News March 20, 2024

MBNR: ఐదుగురిలో మిగిలేది ఒక్కరే!

image

ఉమ్మడి పాలమూరులో ఉన్న ఐదుగురు జిల్లా పరిషత్ ఛైర్మన్లలో BRS పార్టీకి ఇక ఒక్కరే మిగలనున్నారు. ఒక్కొక్కరుగా ఇప్పటికే ముగ్గురు పార్టీలు మారగా, MBNR జెడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి నేడు BRSను వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ శాంత కుమారి ఒక్కరే BRS తమకు పదవులు ఇచ్చిందని, పార్టీ మారే ప్రసక్తే లేదు అంటూ స్పష్టం చేశారు.

Similar News

News September 18, 2024

పరుశురామ స్వామి కొలువై ఉన్న ఏకైక ప్రదేశం ఇదే..!

image

ఉమ్మడి జిల్లాలో పరశురాముడు కొలువై ఉన్న ఏకైక ప్రదేశం ఏది అంటే అది జోగులాంబ గద్వాలలోని జమ్మిచెడు మాత్రమే. ఇక్కడ జమ్ములమ్మ దేవస్థానానికి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. వీరంతా పక్కనే వెలిసి ఉన్న పరశురామ స్వామి ఆలయాన్ని కూడా దర్శించి మొక్కలు తీర్చుకోవడం గమనార్హం.

News September 18, 2024

శ్రీశైలంలో నీటిమట్టం 881.7 అడుగులు

image

ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల నుంచి మొత్తం 40,949 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 37,116 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,755 మొత్తం 67,871 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయంలో మంగళవారం నీటిమట్టం 881.7 అడుగుల వద్ద 197.4616 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

News September 18, 2024

గద్వాల: అమ్మమ్మ మరణంతో అనాథలైన చిన్నారులు

image

అమ్మమ్మ మరణంతో చిన్నారులు అనాథలయ్యారు. వడ్డేపల్లి శాంతినగర్ చెందిన కృష్ణవేణికి ఉదయ్ కౌసిక్(11), భానుప్రకాష్(10) ఇద్దరు పిల్లలు. పిల్లల చిన్నతనంలోనే భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బంది పడ్డ కృష్ణవేణి అనారోగ్యంతో చనిపోగా తాజాగా.. ఆమె తల్లి జయమ్మ మృతితో పిల్లలు అనాథలయ్యారు. కాగా వారిని ఆస్తిని కాపాడి చిన్నారులను ఆదుకోవాలని అధికారులను స్థానికులు కోరారు.