News March 6, 2025

MBNR: ఒకవైపు తండ్రి మృతి.. మరోవైపు పరీక్ష

image

అయ్యో.. కాలం ఆ ఇంటర్ విద్యార్థికి ఎంతటి కఠిన పరీక్ష పెట్టిందో..! ఒకవైపు ఇంటర్ పరీక్షలు, మరోవైపు తండ్రి మృతదేహం. నాన్న దూరమయ్యాడన్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థి వెళ్లిన ఘటన గద్వాల జిల్లా అల్లంపూర్ మండలంలోని లింగన్వాయిలో జరిగింది. గ్రామానికి చెందిన మహబూబ్ బాషా కుమారుడు సమీర్ దేవరకద్రలో గురుకులంలో ఇంటర్ పరీక్ష రాసి అంత్యక్రియలో పాల్గొనడం అందరిని కంటతడి పెట్టించింది.

Similar News

News March 7, 2025

MBNR: నేడు ఘనంగా మహిళా దినోత్సవం: కలెక్టర్

image

ఈనెల 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఒక ప్రకటన తెలిపారు. ముఖ్య అతిథులుగా ఎంపీటీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలతోపాటు మూఢా ఛైర్మన్ లక్ష్మణ యాదవులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

News March 6, 2025

మహబూబ్‌నగర్: లారీ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం

image

మహబూబ్‌నగర్ జిల్లా బండమీదిపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  పాలమూరు యూనివర్సిటీ ఎదురుగా సైకిల్‌పై వస్తూ నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన లారీ( ట్రక్కు) కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో పాలమూరు యూనివర్సిటీ నుంచి అర కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.

News March 6, 2025

జడ్చర్ల: క్రేన్ మరమ్మతుల కోసం వచ్చి హత్య

image

క్రేన్ మరమ్మతుల కోసం వచ్చి <<15574517>>వ్యక్తిని <<>>హత్య చేసిన ఘటన MBNR జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామంలో జరిగింది. హైదరాబాద్ ఎంజీబీఎస్లో పోలీసులు బుధవారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు. కేసు పూర్వాపరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. 24వ తేదీన క్రేన్ మరమ్మతు కోసం పుణేకు చెందిన వినయ్ రాగా అతను బస చేస్తున్న గది వద్ద బిహార్‌కు చెందిన రషీద్‌తో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అతన్ని గోడకేసి బాది చంపేశాడు.

error: Content is protected !!