News September 19, 2024

MBNR: ఓటర్ జాబితాలో సవరణలు చేయండి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ జాబితాలో ఈనెల 21 వరకు మార్పులు చేర్పులు చేసుకోవాలని MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. కొత్త ఓటర్ల నమోదు, మృతి చెందిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లు తొలగింపు, చిరునామా మార్పు, తప్పులను సరిదిద్దడం లాంటి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె తెలిపారు.

Similar News

News October 3, 2024

వనపర్తి: ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్

image

వనపర్తి జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన రాకేష్ హైదరాబాద్ గణేష్ బందోబస్తుకు వెళ్లి విధుల్లో చేరకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం సీసీఏ రూల్స్‌కు విరుద్ధమని సస్పెండ్ చేశారు. పానగల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన రామకృష్ణ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరుతో సస్పెండ్ చేశారు.

News October 3, 2024

WNP: 21 నుంచి CM కప్ పోటీలు: శివసేనారెడ్డి

image

ఈ నెల 21 నుంచి ప్రతి గ్రామంలో గ్రామస్థాయి CM కప్ పోటీలు ప్రారంభిస్తామని సాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి వెల్లడించారు. ఈనెల 21 నుంచి ఆరు అథ్లెటిక్స్ విభాగాల పోటీలను, ఖోఖో, వాలీబాల్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. 21 నుంచి 24 వరకు గ్రామీణ స్థాయి పోటీలు, 24 నుంచి 30 వరకు మండల స్థాయి పోటీలు, NOV 8 నుంచి 13 వరకు జిల్లా స్థాయి పోటీలు ఉంటాయన్నారు. NOV 28 నుంచి DEC 5వరకు రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు.

News October 3, 2024

వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో 84 బ్లడ్ నిల్వలు

image

వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 84 బ్లడ్ నిల్వలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి జయచంద్ర మోహన్ గురువారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. A+(ve) 11, A- (ve) 06, B+(ve) 19, B-(ve) 00, O+(ve) 37, O-(ve) 01, AB+(ve) 09, AB-(ve) 01 ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు.