News October 23, 2024
MBNR: కంపోస్టు కేంద్రాలు.. వినియోగంలోకి వచ్చేనా !

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం మొత్తం 1,690 కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రాలను నిర్మించింది. ఒక్కో కేంద్రానికి రూ.12 లక్షల చొప్పున మొత్తం రూ.42.23 కోట్లు ఖర్చు చేసింది. తడి చెత్తతో కంపోస్టు ఎరువు, పొడి చెత్తను రీసైక్లింగ్ ద్వారా స్వచ్ఛతను సాధించే ఉద్దేశంతో వీటి నిర్మాణం చేపట్టి నిధులు విడుదల చేసింది. సిబ్బంది లేకపోవడంతో ఆ కేంద్రాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
Similar News
News December 20, 2025
MBNR: విదేశాల్లో ఉన్నత విద్య.. అప్లై చేసుకోండి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు విదేశాలలో అత్యున్నత విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ అభివృద్ధి అధికారిణి ఇందిర “Way2News” ప్రతినిధితో తెలిపారు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు ఈనెల 21లోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 20, 2025
MBNR: సర్పంచ్ ఎన్నికలు..అప్పులు తీర్చేదెలా..?

ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల పుణ్యామా.. వందలాది కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పోటీకోసం చేసిన ఖర్చు తడిసి మోపెడయ్యాయి. ఇప్పుడు అప్పులు తీర్చేదెలా? అని ఓటమి అభ్యర్థుల కుటుంబాల్లో తీవ్ర అంతర్మథనం నెలకొంది. ‘రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయని పోటీ చేస్తే.. తీరా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసినా.. గెలవకపోతిమి ఉన్న ఆస్తులు, బంగారం పాయే.. అప్పుల కుప్పాయె’ అంటూ చాలా కుటుంబాలు కుమిలిపోతున్నాయి.
News December 20, 2025
MBNR: ఊర్లో సంబరాలు.. యువతిపై అత్యాచారం

సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాల నడుమ ఘోర విషాదం MBNR(D) మూసాపేట(M) మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. SI వేణు వివరాల ప్రకారం.. సంబరాలను వీక్షించడానికి వచ్చిన ఓ యువతిని విష్ణు రైతు వేదిక వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెరేంట్స్ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.


