News March 27, 2025
MBNR: కమీషన్ల ముంపులో కూరుకుపోయింది: ఆర్ఎస్పీ

‘మా SC- సబ్ ప్లాన్ నిధులు (రూ.35,000 కోట్లు) ఎక్కడికి వెళ్తున్నాయి?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల ముంపులో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన అత్యుత్తమ విద్యార్థి ఒకరు రాసిన లేఖను దయచేసి చదవండి అంటూ కోరారు.
Similar News
News October 23, 2025
ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కనుకులగిద్ద యువకుడు

హుజురాబాద్ మండలం కనుకులగిద్దకి చెందిన మొగిలిచర్ల కిషోర్ 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. గ్రామానికి వన్నె తెచ్చిన కిషోర్‌ను కనుకులగిద్ద డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సన్మానించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అకుంటిత దీక్షతో 5 ఉద్యోగాలు సాధించిన కిషోర్ గ్రామానికే గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. కిషోర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రామ యువతకు సూచించారు.
News October 23, 2025
ఒంగోలు: 16 మందికి కారుణ్య నియామకాలు

ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. బుధవారం ఆయన జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి ప్రకాశం భవనంలోని తన ఛాంబరులో 16 మందికి కారుణ్య కోటాలో నియామక పత్రాలను అందించారు. విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ వారిని అభినందించారు.
News October 23, 2025
రాకియా పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా

TG: వాన్‌పిక్ వ్యవహారంలో వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌పై రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(RAKIA) దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు(HYD) విచారించింది. తమకు రూ.600 కోట్లు చెల్లించాలన్న రస్ అల్ ఖైమా కోర్టు ఆదేశాలు అమలు చేయాలని రాకియా పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను త్వరగా తేల్చాలని ఇటీవల TG హైకోర్టు ఆదేశించింది. రాకియా ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.