News July 13, 2024
MBNR: కాంగ్రెస్‌లోకి MLA.. KTRను కలిసిన BRS నేతలు

HYD బంజారాహిల్స్‌లోని నంది నగర్‌లో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆ పార్టీ గద్వాల జిల్లా నాయకులు ఆంజనేయులు గౌడ్, బాసు హనుమంతు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం నియోజకవర్గంలోని రాజకీయ పరిమాణాలపై, సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం విషయమై కేటీఆర్ వారికి పలు సూచనలు చేశారు.
Similar News
News February 15, 2025
జోగులాంబ: పంచాయతీ కార్యదర్శిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ACB

ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ACB DSP బాలకృష్ణ కథనం మేరకు DPO శ్యామ్ సుందర్ సూచనతో ఒక వెంచర్ మేనేజర్ తో పంచాయతీ కార్యదర్శి రూ. 2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు తెలిపారు. DPO కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
News February 14, 2025
MBNR: నేటి నుంచి మహానగరోత్సవం

జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నేడు, రేపు ‘మన మహబూబ్ నగర్ మన మహానగరోత్సవం’ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌గా ఏర్పాటైనా సందర్భంగా నగర ప్రముఖులు, ప్రజలందరూ వారి అనుభవాలు మహానగరోత్సవం వేదికగా వ్యక్త పరచనున్నారు. ప్రముఖ నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
News February 14, 2025
బిజినేపల్లి: అనుమానాస్పదంగా మహిళ మృతి

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో అనుమానాస్పదంగా మహిళ మృతి చెందింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నమ్మ(55) బుధవారం రాత్రి భర్త సుల్తాన్ పొలానికి వెళ్లగా ఒంటరిగా పడుకుంది. ఉదయం భర్త ఇంటికి వచ్చిన సమయంలో ఆమె గాయాలతో ఉంది. వెంటనే నాగర్‌కర్నూల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు బిజినేపల్లి ఎస్ఐ తెలిపారు.