News April 4, 2024
MBNR: కాంగ్రెస్ పార్టీలో చేరిన బాద్మీ శివకుమార్

రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ ఛైర్మన్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బాద్మీ శివకుమార్, తదితర నేతలు గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న శివకుమార్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు పాటు మరికొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.
Similar News
News March 7, 2026
MBNR: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

స్వల్ప గొడవ విషయంలో తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం నవాబుపేట మండలం గురుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గణేష్ (21) అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. హోలీ వేడుకల్లో స్నేహితులతో గొడవపడటంతో ఇంటి పెద్దలు మందలించారు. దీనిని అవమానంగా భావించిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
News March 7, 2026
MBNR: రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ మృతి

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్ స్టేజ్ వద్ద నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. చనిపోయిన వారిలో ఒకరు కొత్తకోట మండలం వడ్డేవాట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ రవి, మరొకరు కొత్తకోటకు చెందిన హమాలీ కూలీ నాగన్నగా గుర్తించారు. గాయాల పాలైన ఆర్టీసీ డ్రైవర్ పురుషోత్తం (58) చికిత్స పొందుతూ రాత్రి మరణించాడు.
News March 6, 2026
MBNR: ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

ప్రజా పాలని -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా పిలుపునిిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 6 తారీకు నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 99 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.


