News September 30, 2024

MBNR: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
MBNR: 3239 121 1:27
NGKL: 3625 125 1:29
NRPT: 2683 137 1:19
WNP: 2137 53 1:40
GDWL: 2893 72 1:40

Similar News

News October 13, 2024

సొంతూరిలో రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో విజయదశమి సందర్భంగా శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒకేసారి రోడ్డుపైకి వచ్చి బోనాలతో పాటు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆయనకు స్వాగతం పలికారు. దీంతో సీఎం ఆనందంతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

News October 12, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా విజయదశమి వేడుకలు.
✓ అలంపూర్: కన్నుల పండుగగా తెప్పోత్సవం.
✓ అలంపూర్: జోగులాంబను దర్శించుకున్న డీజీపీ జితేందర్.
✓ కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించి దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.
✓ కల్వకుర్తి: ఉప్పొంగిన దుందుభి వాగు రాకపోకలు బంద్.
✓ రేపు కోడంగల్ రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
✓ ఉమ్మడి జిల్లాలో ఘనంగా బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలు.

News October 12, 2024

MBNR: కుంటలో పడి అన్నదమ్ములు మృతి

image

దసరా వేళ మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నీట మునిగి అన్నదమ్ములు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. మూసాపేట మండలం స్ఫూర్తి తండాకు చెందిన సక్రు నాయక్ పిల్లలు సాయి(12), సాకేత్(10). సాయి చక్రాపూర్ గ్రామంలో, సాకేత్ MBNRలో చదువుతుండగా దసరా సెలవులకు ఊరికొచ్చారు. ఇవాళ సాయంత్రం ఇంటి సమీపంలో ఉన్న నీటి కుంటలో పడి మృతిచెందారు. స్థానికులు గమనించి కుంట నుంచి మృతదేహాలను బయటకు తీశారు.