News October 30, 2024

MBNR: కురుమూర్తి జాతరకు 179 ప్రత్యేక బస్సులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అతిపెద్ద జాతర, ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. నవంబర్ 7, 8, 9 తేదీల్లో మొత్తం 179 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, కొల్లాపూర్, గద్వాల నుంచి బస్సులు నడపనుండగా, జాతరకు వెళ్లే భక్తుల కోసం బస్టాండ్లలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 5, 2024

అలంపూర్- శ్రీశైలం బోటు ప్రయాణం..?

image

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇటీవలే సోమశిల నుంచి శ్రీశైలానికి బోటు ప్రయాణం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తుంగభద్ర నదిలో జోగులాంబ పుష్కర ఘాట్ నుంచి సోమశిల మీదుగా శ్రీశైలం వెళ్లేందుకు టూరిజం శాఖ ప్రతిపాదన చేస్తున్నట్లు అల్లంపూర్ ఈవో పురేందర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నదిలో వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందనే విషయాన్ని మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. కాగా బోటు ప్రయాణంపై క్లారిటీ రావాల్సి ఉంది.

News November 5, 2024

MBNR: మూడు నెలల వేతనాలు విడుదల

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల వేతనాలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బకాయిలు ఉన్న ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలల జీతాలు విడుదల అయ్యాయని జిల్లా ఇంటర్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే ఖజానాకు బిల్లులు సమర్పించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. వీరికి నెలకు రూ.54,220 చొప్పున గౌరవ వేతనం ఇవ్వనన్నారు.

News November 5, 2024

MBNR: కొత్త రేషన్ కార్డులు.. వచ్చేనా?

image

MBNR:ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలకు రేషన్ కార్డు దారులే అర్హులు.జిల్లాలో 506 చౌకధర దుకాణాలు ఉన్నాయి. మొత్తం రేషన్ కార్డులు 2,39,600,ఇందులో ఆహార భద్రత కార్డులు 2,20,283,అంత్యోదయ కార్డులు 19,016,అన్నపూర్ణ కార్డులు 201 ఉన్నాయి.BRS ప్రభుత్వం 2021లో కొన్ని రేషన్ కార్డులు పంపిణీ చేసింది. ఆ తర్వాత రేషన్ కార్డుల ఊసే లేదు. ఉత్తర్వులు రాగానే చర్యలు చేపడతామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.