News October 30, 2024

MBNR: కురుమూర్తి జాతరకు 179 బస్సులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అతిపెద్ద జాతర, ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. నవంబర్ 7, 8, 9 తేదీల్లో మొత్తం 179 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, కొల్లాపూర్ బస్టాండ్లలో కురుమూర్తి జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 15, 2025

MBNR: ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి- కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా రహదారులపై ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జానకితో పాటు పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, నేషనల్ హైవే అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే నేషనల్ హైవే 44, 167 పై బ్లాక్‌స్పాట్స్ గుర్తించి సంబంధిత శాఖలు తగు చర్యలు తీసుకోవాలన్నారు.

News November 15, 2025

MBNR: ధాన్యం కేటాయింపునకు బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి

image

2025-26 ధాన్యం కేటాయింపుకు బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 92 రైస్ మిల్లులు ఉండగా నామమాత్రంగా కేవలం 42 రైస్ మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారెంటీని సమర్పించాయని అన్నారు. గ్యారంటీ ఇవ్వని మిల్లులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయింపు జరగదన్నారు.

News November 15, 2025

MBNR: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తులకు గడువు పెంపు

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 19వ తేదీ వరకు గడువు విధించడం జరిగిందని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు ఒక ప్రకటన ద్వారా వెలడించారు. జిల్లాలో అర్హత కలిగిన విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి అన్నారు. వివరాలకు 77309 09838 నంబర్ సంప్రదించాలన్నారు.