News June 12, 2024
MBNR: కృష్ణ, తుంగభద్ర నదులకు వరద

కృష్ణ, జూరాల, తుంగభద్ర నదులకు వరద వస్తోంది. కర్ణాటకలో గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 4. 94 టీఎంసీల నీళ్లున్నాయి. 7211 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తున్నది. వరద నీరు ఆర్డీఎస్ మీదుగా మండలంలోని పులికల్ సమీపంలో ఉన్న నాగల దిన్నె బ్రిడ్జి వద్దకు చేరుకుంది. 2 నెలలుగా ఎండిన తుంగభద్రకు వరద రావడంతో నదీ తీర గ్రామాల ప్రజలు, రైతులు ఊరట చెందారు.
Similar News
News March 25, 2025
MBNR: ‘లంబాడీ గిరిజనులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి’

గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి వారి సంక్షేమానికి కృషి చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు నాయక్ కోరారు. MBNRలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తండాలను పంచాయతీలుగా, గోర్ బోలి భాషను 8 షెడ్యూల్‌లో, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, నిరుద్యోగ భృతి,గిరిజనులకు ట్రైకార్ రుణాలు మంజూరు చేసి న్యాయం చేయాలన్నారు. గిరిజన సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే అసెంబ్లీ ముట్టడి చేస్తామన్నారు.
News March 25, 2025
పాలమూరుకు మరో మంత్రి పదవి..!

పాలమూరు జిల్లాకు మరో మంత్రి రానుందని టాక్. మక్తల్ MLA వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు మంత్రి పదవి దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో పార్టీ అధిష్ఠానంతో చర్చ అనంతరం మంత్రివర్గ విస్తరణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. మార్చి30న ఉగాది పండగ రోజు కొత్త మంత్రులు రానున్నారు.కాగా ఉమ్మడి MBNR నుంచి CM రేవంత్ రెడ్డి (కొడంగల్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) మంత్రులుగా ఉండగా శ్రీహరితో ఆ సంఖ్య 3కు చేరనుంది.
News March 25, 2025
MBNR: ఈనెల 26వ తేదీన ఉద్యోగమేళ

ఈనెల 26వ తేదీన బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి మైత్రి ప్రియ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో నిర్వహించే ఈ ఉద్యోగమేళాకు విజయ ఫెర్టిలైజర్స్, ట్రెండ్స్, ధ్రువంత్ సొల్యూషన్స్ లాంటి సంస్థలు పాల్గొంటున్నాయని వెల్లడించారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన 30 ఏళ్లలోపు యువకులు అర్హులని వెల్లడించారు.