News December 29, 2024
MBNR: కొండెక్కిన గుడ్డు ధర
ఉమ్మడి పాలమూరులో గతంలో ఎప్పుడు లేని విధంగా కోడి గుడ్డు ధర కొండెక్కింది. నూతన సంవత్సర వేడుకల్లో కేకు తయారీలో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో మరింత పెరిగే అవకాశం ఉంది. రిటైల్ ధర అక్టోబర్- రూ.6.30, నవంబర్- రూ.6.50, డిసెంబర్- రూ.7.10 పైన ఉంది. కార్తీక మాసం ముగియడంతో మాంసం ధర తగ్గి గుడ్ల ధర గణనీయంగా పెరిగింది. ధర పెరగడంతో గుడ్లు నోటికి అందడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 6, 2025
మహబూబ్నగర్: ఉరేసుకుని ఇద్దరి ఆత్మహత్య
ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన ఇద్దరు వేర్వేరు కారణాలతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలిలా.. మల్దకల్కు చెందిన కుమ్మరి నర్సింహులు(42) గద్వాలలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకున్నారు. వారు లోన్ చెల్లించాలని ఒత్తిడి తేవటంతో ఈ నెల 3న ఉరేసుకున్నారు. నందివడ్డెమాన్కి చెందిన చెన్నయ్య(45) ఆదివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు.
News January 6, 2025
మహబూబ్నగర్: స్థానిక పోరుకు సన్నద్ధం..!
ఉమ్మడి MBNR జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది.
News January 6, 2025
NGKL: పెళ్లి చూపులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
నాగర్కర్నూల్ జిల్లా చారకొండలో జరిగిన <<15075870>>రోడ్డు <<>>ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. స్థానికుల తెలిపిన ప్రకారం.. కల్వకుర్తి మండలం తాండ్రకి చెందిన రామకోటి (32), వెల్దండ మండలం కొట్రకు చెందిన గణేశ్ (34)తో కలిసి పెళ్లి చూపుల కోసం వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో వీరి కారు లారీని బలంగా ఢీకొట్టింది. ఈఘటనలో కారు నుజ్జునుజ్జు అయి అందులో ఇరుక్కుని స్పాట్లో చనిపోయారు. కేసు నమోదైంది.