News November 8, 2024
MBNR: కొత్త రుణాలకు ఆసక్తి చూపని రైతులు !
ప్రభుత్వం ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో రూ.లక్ష లోపు 1,69,838 మంది రైతులకి రూ.952.7 కోట్లు రుణాలు, రెండో విడతలో 1,04,113 మందికి రూ.1,025.01కోట్లు, మూడో విడతలో 64,597 మందికి రైతులకు రూ.803.76 కోట్ల రుణాలు మాఫీ చేసింది. వీరందరూ కొత్త రుణాలను అర్హులైనప్పటికీ 40% మంది కూడా రుణాలు తీసుకోలేదు. ఇంకా మాఫీ కానీ రైతులు 2,10,560 మంది ఉండగా వీరందరూ రెన్యువల్ చేసేందుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 8, 2024
NGKL: దారుణం.. తెల్లవారుజామునే హత్య
పొలం వద్ద రాత్రి కాపలా కాస్తున్నయువకుడని గుర్తుతెలియని దుండగలు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలంరేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెల్దండ మండలం ఎంజీకాలనీ తండాకు చెందిన రాత్లావత్ రాజు(30) నిన్న రాత్రి పొలం వద్ద కాపలాకు వెళ్లాడు. కాగా.. ఈ తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు రాజుపై దాడి చేసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు.
News November 8, 2024
’క‘ సినిమాలో నల్లమల బాల నటుడు
ఉప్పునుంతల మండలం దేవదారికుంట గ్రామానికి చెందిన కాట్రావత్ రవీందర్ కుమారుడు కాట్రావత్ హర్షవర్ధన్ ’క‘ చలనచిత్రంలో చిన్నప్పటి హీరోపాత్ర పోషించాడు. ఈ బాల్య నటుడు తన చిన్న వయసులో 4 సినిమాల్లో నటించాడు. నేడు మరోసారి ’క‘ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రను పోషించాడు. హర్షవర్ధన్, ముందు ముందు ఇంకా మరెన్నో సినిమాల్లో నటిస్తూ గొప్ప నటుడిగా పేరుతెచ్చుకోవాలని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News November 7, 2024
ఉమ్మడి పాలమూరులో TODAY TOP NEWS
▶ఏసీబీకి పట్టుబడ్డ పాలమూరు డీఈఓ▶కుటుంబ సర్వే పేరుతో కాంగ్రెస్ డ్రామాలు: డీకే అరుణ▶NGKL:కుక్కల దాడి..20 మేక పిల్లల మృతి▶పర్యాటక అభివృద్ధికి చేయూత ఇవ్వాలి: మంత్రి జూపల్లి▶గద్వాల: బైక్ అదుపుతప్పి మహిళ మృతి▶మాడుగుల: కన్న కొడుకును నరికి చంపిన తండ్రి▶కురుమూర్తి జాతరకు ప్రత్యేక బస్సులు▶సర్వీస్ నుంచి DEOని డిస్మిస్ చేయండి:SFI,AISF▶ఈనెల 9,10న ఓటర్ నమోదు ప్రత్యేక డ్రైవ్