News September 22, 2024
MBNR: కొత్త రేషన్ కార్డులు.. ఈసారైనా వచ్చేనా.?
ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలకు రేషన్ కార్డు దారులే అర్హులు.జిల్లాలో 506 చౌకధర దుకాణాలు ఉన్నాయి. మొత్తం రేషన్ కార్డులు 2,39,600,ఇందులో ఆహార భద్రత కార్డులు 2,20,283,అంత్యోదయ కార్డులు 19,016,అన్నపూర్ణ కార్డులు 201 ఉన్నాయి.BRS ప్రభుత్వం 2021లో కొన్ని రేషన్ కార్డులు పంపిణీ చేసింది. ఆ తర్వాత రేషన్ కార్డుల ఊసే లేదు. ఉత్తర్వులు రాగానే చర్యలు చేపడతామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు.
Similar News
News November 14, 2024
నాగర్‌కర్నూల్: ఆర్మీ జవాన్ సూసైడ్
బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లి గ్రామంలో ఆర్మీ జవాన్ సూసైడ్ చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ శివాజీ(28).. వారం క్రితం డ్యూటీ నుంచి సెలవుపై ఇంటికి వచ్చారు. గురువారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నట్లు గుర్తించామని స్థానికులు తెలిపారు. అందరితో స్నేహంగా ఉండే శివాజీ మృతి తమను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 14, 2024
పాలమూరులో ఫోన్ ట్యాపింగ్ కలకలం
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు ఉన్నతాధికారులనే విచారించగా తాజాగా ప్రజాప్రతినిధుల వైపు మళ్లింది. విచారణలో భాగంగా జిల్లాకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఫోన్ ట్యాపింగ్‌కు సహకరించిన ఆధికారుల పాత్రపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీనిపై గతంలో MBNR ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
News November 14, 2024
లగచర్ల ఇష్యూ.. ఈ మండలాల్లో ఇంటర్నెట్ బంద్!
కోడంగల్ నియోజకవర్గం లగచర్లలో హైటెన్షన్ ఇంకా వీడలేదు. గ్రామం నిర్మానుష్యంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గత రెండు రోజులుగా దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కావడంతో BRS నాయకులు, కార్యకర్తలు ఆయా మండలాల్లో నిరసనలు తెలిపారు.